జమ్ము కశ్మీర్ బుడ్గాం జిల్లాలో భద్రతా దళాలు ఇద్దరు తీవ్రవాదులను హతమార్చాయి. ఈ రోజు ఉదయం గోపాల్పొరా ప్రాంతంలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన సైనికులు ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జమ్ము ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాయి.
భారత సైనికుడు
ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని నిర్బంధ తనీఖీలు చేపడుతోంది. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారో ఇంకా వివరాలు తెలియలేదు.