తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ... భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు భాజపా నాయకుడు జితేందర్‌రెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగులు నిరసనలు చేపడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ ముందస్తు బెదిరింపులకు దిగుతున్నారని వివరించారు. జిల్లా కలెక్టర్లకు ఉండే విధులను పూర్తిగా పార్టీకి అప్పచెప్పి మంత్రుల ద్వారా పాలన సాగించాలని చూస్తున్నారన్నారు. ఈ విషయంపై ఐఏఎస్ అధికారులు పునరాలోచించుకోవాలని కోరారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న రెవెన్యూ, పురపాలక చట్టాల్లోని మార్పులను ప్రజలకు ముందుగానే వివరించాలని డిమాండ్ చేశారు.
తెరాస భయభ్రాంతులకు గురిచేస్తోంది: జితేందర్‌రెడ్డి - bjp
ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉన్న తెరాస ప్రభుత్వం ఇప్పుడు వారికే వార్నింగ్ ఇస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలతో భయభ్రాంతులకు గురి చేస్తోంది. ----- జితేందర్ రెడ్డి, భాజపా నేత
జితేందర్ రెడ్డి