తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జయలలిత పాత్ర చేసేందుకు అంత డబ్బిస్తున్నారా? - జయలలిత బయోపిక్

జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కనున్న 'తలైవి' సినిమా​లో కంగనా నటించనుంది. ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించారని సమాచారం.

జయ పాత్రలో నటించేందుకు కంగనా రూ.24 కోట్లు డిమాండ్ చేసిందట

By

Published : Mar 25, 2019, 6:59 PM IST

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​లో నటించనుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త బయటకొచ్చింది. జయ పాత్రలో నటించేందుకు కంగనా రూ.24 కోట్లు డిమాండ్ చేసిందట. నిర్మాతలూ దీనికి అంగీకరించారని టాక్.

ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా... తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కంగనా అయితే త్వరగా అభిమానులకు చేరువవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details