"బరేలీ లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, వారి సభ్యులు పార్లమెంటులో 'ముమ్మారు తలాక్' బిల్లు ఉపసంహరణకు హామీ ఇచ్చారు. వారు (కాంగ్రెస్) కేవలం రాజకీయ లబ్ధికోసం ముస్లిం మైనారిటీలను ఆకట్టుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. వారి మనస్సాక్షి వారిని ప్రశ్నించడంలేదా?" అని అరుణ్‌జైట్లీ ఫేస్బుక్లో ప్రశ్నించారు.
అవకాశవాద రాజకీయ నాయకులు పత్రికల్లో పతాక శీర్షికల్లో కనబడాలని చూస్తారు. కానీ జాతి నిర్మాతలు భవిష్యత్ గురించి ఆలోచిస్తారని జైట్లీ వ్యాఖ్యానించారు.
అప్పుడు...
గతంలో దివంగత రాజీవ్‌గాంధీ కూడా 'షా బానూ' కేసులో ఇలాంటి తప్పే చేశారని అరుణ్‌జైట్లీ విమర్శించారు. విడాకులు పొందిన మహిళలకు భృతి కల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును కాదని రాజీవ్ అన్యాయం చేశారని, ఫలితంగా మహిళలు పేదరికంలో మగ్గిపోయారని అరుణ్‌జైట్లీ అన్నారు.