'సీబీఐకి ఇవ్వకుంటే న్యాయ పోరాటమే' - jagan on babu
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించేలా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్‌కు వైకాపా అధినేత జగన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తునకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.
jagan
రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్న జగన్...ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఏ తప్పుచేయకుంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. పక్కా పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపించారు. కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి సహాయపడుతున్నారని అన్నారు.
Last Updated : Mar 16, 2019, 6:24 PM IST