వేరుశనగ పండించడంలో వనపర్తి దేశంలోనే మూడో స్థానంలో ఉందని.. ఈ పంట ఉత్పత్తులను పెంచి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి పి.రాములుతో ఖిలా ఘణపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువత ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకుండా వ్యవసాయంపై కూడా దృష్టి సారించాలని సూచించారు. 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే... దేశంలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలుస్తుందన్నారు.
ఇది ట్రైలర్ మాత్రమే: నిరంజన్‌రెడ్డి - mp
ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. ----- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

నిరంజన్‌రెడ్డి
Last Updated : Apr 3, 2019, 11:49 AM IST