తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2019, 5:18 PM IST

ETV Bharat / briefs

సొంత జట్టుకు ఆడటం ప్రత్యేకం

ఐపీఎల్​లో దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఆనందంగా ఉందని పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. సొంత మైదానంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు.

దిల్లీ జట్టుకు ఆడటమెంతో ప్రత్యేకమంటున్న ఇషాంత్ శర్మ

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడటం ఎంతో ప్రత్యేకమైందని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. తన క్రికెట్ జర్నీ మొదలైన చోటుకే తిరిగి రావడం ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సొంత జట్టుకు అతడు ఆడటం ఇదే మొదటిసారి.

ఇప్పటివరకు ఐపీఎల్​లో దక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్​కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్​ తరఫున పేసర్​గా బాధ్యతలు నిర్వహించాడు.

నా వరకు వస్తే ఫిరోజ్ షా కోట్లా మైదానం కాదు. అండర్-17లో ఆడినప్పటి నుంచి నాకు ఇక్కడెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేనే కాదు మరెందరో నాలాంటి క్రికెటర్స్ ఇక్కడి నుంచే కెరీర్ మొదలు పెట్టి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు --ఇషాంత్ శర్మ, భారత జట్టు బౌలర్

గతేడాది జైపూర్​లో జరిగిన ఐపీఎల్​ వేలంలో ఒక కోటి 10 లక్షల రూపాయలకు దిల్లీ జట్టు...ఇషాంత్​ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 76 మ్యాచ్​లాడి 58 వికెట్లు తీశాడీ బౌలర్.

మార్చి 24న తన తొలి మ్యాచ్​లో​ ముంబయి ఇండియన్స్​తో తలపడునుంది దిల్లీ క్యాపిటల్స్.

ABOUT THE AUTHOR

...view details