తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఐటీ గ్రిడ్ కార్యాలయం సీజ్

ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు పశ్చిమ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రకు మరోసారి వివరించారు. అమెజాన్ నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే డేటాను మరోసారి విశ్లేషించనున్నారు.

By

Published : Mar 9, 2019, 8:33 AM IST

ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్​ను అరెస్ట్ చేస్తాం :   స్టీఫెన్ రవీంద్ర

ఐటీ గ్రిడ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు చేస్తోన్నవిచారణ బృందం
ఐటీ గ్రిడ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హార్డ్ డిస్క్, కంప్యూటర్లను పూర్తిగా స్వాధీనం చేసుకుని మాదాపూర్​లోని ఐటీ గ్రిడ్ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. హార్డ్ డిస్క్​లోని డేటాను ఐటీ నిపుణుల సాయంతో విశ్లేషిస్తున్నారు. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్​ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.


సిట్ కార్యాలయం తరలింపు...


గోషామహల్ స్టేడియం ఆవరణలో ఉన్న సిటీ భద్రతా విభాగం కార్యాలయంలోకి సిట్ కార్యాలయాన్ని తరలించారు. సిట్ ఏర్పడిన తర్వాత రెండు రోజుల పాటు డీజీపీ కార్యాలయంలోనే విచారణ కొనసాగించారు. ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఛాంబర్​లోనే సిట్ సభ్యులు కేసుకు సంబంధించిన వివరాలు చర్చించారు.

ఇవీ చదవండి:మనోళ్ల డేటాను దోచేశారు

ABOUT THE AUTHOR

...view details