తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'ఒక్క బుల్లెట్​ ప్రయోగించినా.. మూల్యం చెల్లిస్తారు' - IRAN WARNS US

అగ్రరాజ్యం నిఘా డ్రోన్‌ కూల్చివేత తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తమపై అమెరికా దురాక్రమణకు దిగితే... పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్​ హెచ్చరించింది.

'ఒక్క బుల్లెట్​ వచ్చినా.. మూల్యం చెల్లించక తప్పదు'

By

Published : Jun 22, 2019, 5:34 PM IST

Updated : Jun 22, 2019, 6:13 PM IST

తమపై కవ్వింపు చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను హెచ్చరించింది ఇరాన్​. తమవైపు ఒక్క బుల్లెట్​ ప్రయోగించినా అమెరికా, మిత్రదేశాలు మూల్యం చెల్లించుకుంటాయని ఇరాన్​ సైన్యం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

తమ డ్రోన్​ను కూల్చివేసినందుకు ఇరాన్​పై దాడికి అమెరికా సర్వం సిద్ధం చేసుకొని, చివరి నిమిషంలో ఆలోచన విరమించుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ శుక్రవారం తెలిపారు.
నిబంధనలు అతిక్రమించినందుకే అమెరికా డ్రోన్​ను కూల్చివేసినట్లు ఇరాన్​ వివరణ ఇవ్వగా.. అమెరికా తోసిపుచ్చింది.

ఇరాక్​లో అమెరికా బలగాలకు భద్రత కట్టుదిట్టం

ఇరాన్​-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాక్​లోని అగ్రరాజ్యం సైన్యానికి భద్రతను కట్టుదిట్టం చేశారు. తమ దేశంలో అతిపెద్ద ఎయిర్​బేస్​లో ఆశ్రయం పొందుతున్న అమెరికా శిక్షకులకు భద్రతా ప్రమాణాలు పెంచినట్లు ఇరాక్​ సైన్యాధికారి ఫాలా తెలిపారు. గతవారమే ఈ ఎయిర్​బేస్​పై దాడి జరిగింది.

ఇదీ చూడండి: ఇరాన్‌పై దాడికి సిద్ధమై మనసు మార్చుకున్న ట్రంప్‌!

Last Updated : Jun 22, 2019, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details