తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రైజర్స్-రాయల్స్ మధ్య కీలక పోరు నేడే - IPL 2019

తొలి మ్యాచ్​లో పరాజయం చెందిన రాజస్థాన్​ రాయల్స్, సన్​రైజర్స్ హైదరాబాద్​ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి.

స్మిత్, వార్నర్​ ఢీ.. రైజర్స్-రాయల్స్ మధ్య నేడే పోరు

By

Published : Mar 29, 2019, 8:01 AM IST

రాజస్థాన్ - హైదరాబాద్... రెండు జట్లూ ఈ సీజన్​ను ఓటమితో ఆరంభించాయి. మన్కడింగ్​తో బట్లర్ వికెట్ కోల్పోయి మ్యాచ్ చేజార్చుకున్న జట్టు ఒకటైతే, ఉత్కంఠభరిత మ్యాచ్​లో పరాజయం చెందిన జట్టు మరొకటి. హైదరాబాద్ వేదికగా నేడు రాజస్థాన్​ రాయల్స్- సన్​రైజర్స్​ మధ్య మ్యాచ్​ జరగనుంది.

కోల్​కతాతో జరిగిన మొదటి మ్యాచ్​లో 53 బంతుల్లో 85 పరుగులు చేసి పునరాగమనంలో అదరగొట్టాడు వార్నర్. పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో స్టీవ్ స్మిత్​ అంతగా ప్రభావం చూపనప్పటికీ ఈ మ్యాచ్​లో సత్తా చాటాలని రాయల్స్ అభిమానులు ఆశిస్తున్నారు.

సన్​రైజర్స్​ హైదరాబాద్​

గత మ్యాచ్​లో అదరగొట్టిన వార్నర్ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనున్నాడు. కేన్ విలియమ్సన్​, బెయిర్​స్ట్రోలతో టాప్​ ఆర్డర్ బలంగా ఉంది. మిడిల్​ ఆర్డర్​లో విజయ్ శంకర్​, యూసఫ్ పఠాన్, మనీశ్ పాండేలు ఉన్నారు. భువనేశ్వర్, రషీద్ ఖాన్, కౌల్, షకీబ్​ అల్ హసన్​తో బౌలింగ్ బలంగా ఉంది.

సన్​రైజర్స్​.. వార్నర్​పై ఎక్కువగా ఆధారపడుతుంది. మిడిల్ ఆర్డర్​ కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. యూసఫ్ పఠాన్​, మనీశ్ పాండేలు ఫామ్​లోకి రావాల్సి ఉంది. గత మ్యాచ్​లో విజయ్ శంకర్​ ఆకట్టుకోవడం హైదరాబాద్​కు కలిసొచ్చే అంశం. బౌలింగ్​లో బలంగా కనిపిస్తున్నప్పటికీ కీలక సమయంలో చేతులెత్తేస్తున్నారు హైదరాబాద్​ బౌలర్లు. గత మ్యాచ్​లో 16వ ఓవర్​ వరకు పటిష్ట స్థితిలో ఉన్న జట్టు చివర్లో పరుగులు సమర్పించుకుంది. స్కోరు కట్టడి చేయడంలో దృష్టి పెట్టాల్సి ఉంది.

రాజస్థాన్ రాయల్స్​

గత మ్యాచ్​లో ఓటమి పాలైన రాజస్థాన్ ఈ మ్యాచ్​లో గెలవాలనే పట్టుదలతో ఉంది. రహానే, స్టోక్స్, సంజూ శాంసన్, బట్లర్, స్టీవ్ స్మిత్​లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బౌలింగ్​లో స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిష్ణప్ప గౌతమ్, ధవల్ కులకర్ణిలు ఆకట్టుకుంటున్నారు. గత మ్యాచ్​లో కులకర్ణి, క్రిష్ణప్ప గౌతమ్​ బంతితో మంచి ప్రదర్శన చేశారు.

జట్ల అంచనా...

హైదరాబాద్: కేన్ విలియమ్సన్​(కెప్టెన్), షకీబ్ అల్ హసన్, యూసఫ్ పఠాన్, డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, బెయిర్​స్ట్రో(కీపర్), విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, దీపక్​ హుడా, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, మార్టిన్ గప్తిల్, వృద్ధిమాన్ సాహా(కీపర్).

రాజస్థాన్: అజింక్యా రహానే(కెప్టెన్), ధావల్ కులకర్ణి, స్టీవ్ స్మిత్, జాస్ బట్లర్(కీపర్), ఉనద్కట్​, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, క్రిష్ణప్ప గౌతమ్, రాహుల్ త్రిపాఠి, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, మనన్ వోహ్రా, టర్నర్, ఇష్ సోధి.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details