ఆరంభ సమయం సమీపించే కొద్దీ ఐపీఎల్-2020 సందడి మరింత పెరుగుతోంది. దుబాయ్‌లో ఏం జరుగుతోందో ఫ్రాంఛైజీలన్నీ అభిమానులతో పంచుకుంటున్నాయి. క్వారంటైన్ కబుర్లు చెబుతున్నాయి. ఇప్పుడు సాధనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు పోస్టు చేస్తున్నాయి. దుబాయ్ వేడిలో చెమటలు కారుతూ ఆటగాళ్లు పడుతున్న కష్టాన్ని చూపిస్తున్నాయి.
ఐపీఎల్ 2020 కోసం ఆటగాళ్ల సాధన ఇలా... - ipl buzz
ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న క్రికటెర్లందరూ ఏమి చేస్తున్నారో ఎప్పటికప్పుడు అన్ని ఫ్రాంఛైజీలు అభిమానులతో పంచుకుంటున్నాయి. బుధవారం నాటికి తాజా బజ్ ఏంటో చూసేద్దాం.
ఐపీఎల్
అంతేకాకుండా క్వారంటైన్ ముగిశాక ఆయా జట్ల గెట్ టు గెదర్ పార్టీల వివరాలు అందిస్తున్నాయి. టీమ్‌ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ (సెప్టెంబర్ 2) బుధవారం పుట్టిన రోజు జరుపుకోవడం వల్ల అన్ని జట్లూ అతడికి శుభాకాంక్షలు తెలియజేశాయి. తాజా ఐపీఎల్ బజ్ ఏంటంటే..
Last Updated : Sep 2, 2020, 9:46 PM IST