భారత షాట్‌పుట్ ఆటగాడు నవీన్ చికారాను నాలుగేళ్లపాటు సస్పెండ్ చేసింది గ్లోబల్ అథ్లెటిక్స్ యూనిట్. 2018లో నిర్వహించిన ఔట్ కాంపిటీషన్ డోప్ పరీక్షలో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉపయోగించాడని తేలడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో అతడి సస్పెన్షన్ కాలం 2018 జులై 27 నుంచి అమలులోకి వస్తుందని అంతర్జాతీయ వ్యాయామక్రీడల సమాఖ్య(ఐఏఏఎఫ్) ఇంటెగ్రిటీ యూనిట్ శుక్రవారం తెలిపింది.
2018 జులై 27న పాటియాలాలోని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నియమాల మేరకు అథ్లెట్లు పోటీలో పాల్గొనే ముందు నిర్వహించే డోపింగ్ నిర్ధారణ పరీక్షకు నవీన్ చికారా హాజరయ్యాడు. అదే ఏడాది అక్టోబరు 28న కెనడా మాంట్రియల్‌లోని డోపింగ్ ఏజెన్సీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్పేరకాలు తీసుకున్నట్టు తేలింది.