అమ్మ.. మనకు కనిపించే తొలి దైవం మాత్రమే కాదు.. మనల్ని కని, పెంచుతుంది. జీవితంలో ఓ స్థాయికి ఎదిగామంటే దాని వెనుక తన కృషి, ప్రేమ, ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. మన దేశ ప్రముఖ క్రికెటర్లు, అథ్లెట్లు.. తాము దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగడానికి కారణం అమ్మేనని తెలిపారు. నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా, తల్లులపై వారికున్న ప్రేమను చాటుకున్నారు.
విరాట్ కోహ్లీ
తల్లితో ఆనందంగా గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకున్నాడు కోహ్లీ. అందుకు సంబంధించిన రెండు ఫొటోలను పోస్ట్ చేశాడు.
కేఎల్ రాహుల్
"లవ్యూ అమ్మా" అంటూ చిన్నతనంలో తన తల్లితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు.
హర్భజన్ సింగ్
"అమ్మా నువ్వు నా దేవత" అంటూ తన తల్లితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు క్రికెటర్ హర్భజన్ సింగ్.
"నేను ధృడమైన అమ్మాయిని ఎందుకంటే ఓ మహిళ నన్ను ఇలా తయారు చేసింది. ఆవిడే మా అమ్మ" -రాణి రామ్పాల్, హాకీ క్రీడాకారిణి
"జీవితంలో మనల్ని అమ్మ ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. మీరు ఒప్పుకున్న లేకున్న ఇదే సత్యం."