టెలికాం రంగంలో భారత్ త్వరలో 5జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అమితాబ్ కాంత్. 5జీ సాంకేతికతకు సంబంధించిన కొన్ని భాగాలను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించాలని సూచించారు. పెట్టుబడిదారుల ఆధ్వర్యంలో నిర్వహించిన 'మెగ్నిఫీషియంట్ మధ్యప్రదేశ్' కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కాంత్.
"త్వరలోనే 5జీ సాంకేతికతను భారత్ ప్రారంభించాలి. ఇది సాంకేతిక పరికరాలను అనుసంధానిస్తుంది, డేటా ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది. 5జీ తో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దేశీయ సాకేంతికతతో కొన్ని భాగాలను రూపొందించాలని నేను సూచిస్తున్నా. అంతర్జాల డేటా ఇతర దేశాలతో పోల్చితే ఇక్కడ తక్కువ ధరకే లభిస్తోంది. వినియోగం అధికంగా ఉంది. మూడేళ్లలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది."