వార్షిక ప్రపంచ ప్రతిభా సూచీని విడుదల చేసింది ప్రముఖ ఐఎండీసంస్థ. ఇందులో భారత్ గత ఏడాదితో పోలిస్తే 6 స్థానాలు దిగజారి 59వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొత్తం 63 దేశాలను పరిగణనలోకి తీసుకుంది ఐఎండీ. మొదటి స్థానాన్ని స్విట్జర్లాండ్ కైవసం చేసుకుంది. కనిష్ఠ జీవన ప్రమాణాలు, విద్యావ్యయం కారణంగానే భారత్ ర్యాంకు మరింత దిగజారినట్లు ఐఎండీ తెలిపింది.
ప్రపంచ ప్రతిభా జాబితాను సిద్ధం చేసేందుకు.. పెట్టుబడులు, అభివృద్ధి, పోటీతత్వం, నివేదన వంటి అంశాలను పరిగణనలోకి తీసకుంది ఐఎండీ. ఈ జాబితాలో బ్రిక్స్ సభ్య దేశాల కంటే భారత్ వెనుకంజలో ఉండటం గమనార్హం.