వెల్లింగ్టన్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలింది టీమిండియా. ఓవర్ నైట్ స్కోర్ 122-5తో రెండో రోజు బరిలోకి దిగి మరో 43 పరుగులు మాత్రమే జోడించగలిగింది. అజింక్యా రహానే 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మయాంక్ అగర్వాల్ 34, టెయిలెండర్ మహమ్మద్ షమీ 21, రిషబ్ పంత్ 19 పరుగులు చేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే భారత్ ఆలౌట్ - wellington test
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 165 పరుగులకు ఆలౌట్ అయింది. కీవీస్ బౌలర్లు టిమ్ సౌథీ, జేమిసన్‌లు చెరో నాలుగు వికెట్లు తీశారు.
తొలి ఇన్నింగ్స్‌లో 165 పరగులకే భారత్ ఆలౌట్
కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, జేమిసన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. వికెట్ నష్టపోకుండా 8 ఓవర్లలో 17 పరుగులు చేసింది. లేథమ్, బ్లండెల్ క్రీజులో ఉన్నారు.
Last Updated : Mar 2, 2020, 3:35 AM IST