వరంగల్ పట్టణం జిల్లా కేంద్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తుందని ప్రజలు వాపోతున్నారు. 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హన్మకొండలో ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండతీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులను తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండవేడిమికి జనాలు అల్లాడుతున్నారు.
ఠారెత్తిస్తున్న ఎండలు... ఇంకా ఎన్ని రోజులో..! - Increased Temperature
వరంగల్ పట్టణం జిల్లా కేంద్రంలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం వల్ల ప్రజలు ఎండవేడిమికి అల్లాడిపోతున్నారు
ఠారెత్తిస్తున్న ఎండలు... ఇంకా ఎన్ని రోజులో..!