చైనాలో జరుగుతున్న 'వింగ్‌సూట్ ఫ్లైయింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్-2019' పోటీలు సదరు ప్రేక్షకుడిని అబ్బురపరుస్తున్నాయి. పక్షులకు దీటుగా పోటీదారులు చేసిన విన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జంగ్జియాజీలోని 300 మీటర్ల ఎత్తున్న యూహూ శిఖరం అంచు నుంచి అమాంతం దూకేసి విన్యాసాలు చేస్తున్నారు. మనిషికి రెక్కలొచ్చినట్టుండే ప్రత్యేక దుస్తులను ధరించి.. గంటకు 160 కి. మీ ల వేగంతో పక్షిలా ఎగిరిపోతున్నారు. టేకాఫ్, ల్యాండింగ్ ప్రదేశాల మధ్య 990 మీటర్ల దూరం ఉన్నప్పటికీ కఠోర సాధనతో అలవోకగా దూకేస్తున్నారు పోటీదారులు.
పక్షులకు దీటుగా ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..! - చైనా
వారంతా పిట్టల్లా ఎగిరిపోతున్నారు.. ఎత్తయిన పర్వతం నుంచి అమాంతం కిందకు దూకేసి గాల్లో విన్యాసాలు చేస్తున్నారు. వింగ్‌సూట్ ఫ్లైయింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా అందరినీ విశేషంగా అకట్టుకుంటున్న ఈ దృశ్యాలు చూడాలంటే చైనాకు వెళ్లాల్సిందే..!
పక్షులకు దీటుగా ఎగిరిపోతే ఎంత బాగుటుందీ..!
2012 నుంచి జరుగుతున్న ఈ పోటీల్లో ఈ ఏడాది 11 దేశాల నుంచి 16 మంది అనుభవజ్ఞులు పోటీ పడ్డారు. ఈ నెల 5న హ్యూనన్ ప్రావిన్స్‌లో ప్రారంభమైన వింగ్‌సూట్ ఫ్లైయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆదివారం వరకు కొనసాగనుంది. ఈ అద్భుత పోటీలను చూసేందుకు వేలాది మంది జంగ్జియాజీ చేరుకుంటున్నారు. గాలి వేగానికి ఎదురెళ్లి నిలుస్తున్న పోటీదారుల ధైర్యానికి సలాం కొడుతున్నారు.
Last Updated : Sep 29, 2019, 7:23 PM IST