తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కోహ్లీ కోపం నన్ను భయపెట్టింది: రిషభ్ పంత్ - దిల్లీ క్యాపిటల్స్

బ్యాటింగ్​లో సిక్సర్లు బాదే పంత్.. ఒక్క విషయంలో మాత్రం భయపడ్డాడట. అదేంటంటే కోహ్లీ కోపం. తప్పిదాలు చేయడం వల్ల ఎదుటి వారి కోపానికి గురవ్వాల్సి వస్తుందని చెప్పాడు.

కోహ్లీ కోపం నన్ను భయపెడుతుందన్న రిషభ్ పంత్

By

Published : Mar 23, 2019, 4:06 PM IST

తన బ్యాటింగ్​తో టీమిండియా భవిష్యత్తు క్రికెటర్ అనిపించుకున్నాడు రిషభ్ పంత్. మైదానంలో చురుకుగా ఉండే పంత్.. ఒక్క విషయంలో మాత్రం భయపడ్డానని తెలిపాడు. భారత జట్టు సారథి కోహ్లీ కోపం.. తననిభయపెట్టే అంశాల్లో ఒకటని అన్నాడు. సంబంధిత వీడియోను దిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ వెబ్​సైట్​లో ఉంచింది.

నేను సాధారణంగా భయపడను. కానీ కోహ్లీకి వచ్చే కోపం నన్ను భయపెట్టింది. తప్పులు చేస్తే ఎవరైనా కోప్పడతారు. కానీ వాటి నుంచే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు -రిషభ్ పంత్, దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు

టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నాడీ యువ క్రికెటర్. కానీ ఈ మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​ల్లో అతడు చేసిన కీపింగ్ తప్పిదాలు కోహ్లీని నిరుత్సాహపరిచాయి.

ABOUT THE AUTHOR

...view details