ఈసీ నిర్లక్ష్యం...ఎన్నికల వేళ ఏపీలో పరోక్షంగా హింస ప్రజ్వరిల్లేందుకు కారణమైంది.రాష్ట్రంలో ఎన్నికల భద్రత,బందోబస్తు కోసం 1,06,468మంది సిబ్బంది అవసరమని ఏపీ పోలీసులు ప్రతిపాదనలు పంపారు.ఎన్నికల సంఘం మాత్రం తగినంత మందిని కేటాయించలేదు.కేంద్ర సాయుధ బలగాల నుంచి 392కంపెనీలు కావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరగా 197కంపెనీలనే రాష్ట్రానికి పంపారు.
పొరుగు రాష్ట్రాల నుంచి 5,666మందే వచ్చారు. 2014ఎన్నికల కంటే ఈ సారి దాదాపు 45వేల మంది భద్రతా సిబ్బంది తక్కువగా వచ్చారు. సాధారణంగా 10మంది భద్రతా సిబ్బంది ఉండాల్సిన చోట అయిదారుగురితోనే సరిపెట్టాల్సి వచ్చింది.సాధారణ పోలింగ్ కేంద్రాల్లో అయితే హోంగార్డులతోనే జరిపించారు.అరకొర సిబ్బందితో ఘర్షణలు అదుపు చేయటం భారంగా పరిణమించింది.
స్పీకర్ పై దాడి....
తగినంత మంది భద్రత సిబ్బంది లేకపోవడం వల్ల.. ఎన్నికల విధులతో సంబంధం లేని వారు పోలింగ్ కేంద్రానికి 200మీటర్ల ఆవలే ఉండాలన్న కనీస నిబంధన అమలు కాలేదు.ఈ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని,అనేక సమస్యాత్మక బూత్‌లు ఉన్నాయని తెలిసీ...ఈసీ తక్కువ కేంద్ర బలగాలను పంపింది.ఎన్నికల వేళ..దాడులు,ప్రతిదాడులతో గుంటూరు జిల్లాలోని పల్నాడు మరోసారి రక్తమోడింది.సాధారణంగానే పల్నాడు సమస్యాత్మక ప్రాంతం..ఈ విషయం ముందే తెలుసు..కానీ..తగినంత మంది భద్రతా బలగాలను మోహరించడంలో ఎన్నికల సంఘం విఫలమైంది.
వైకాపా ప్రాబల్యమున్న గ్రామాల్లో...తెదేపా నేతలపై దాడులకు పాల్పడ్డారు.సాక్షాత్తూ సభాపతి కోడెలశివప్రసాదరావుకు రాజుపాలెం మండలం ఇనిమెట్లలో చేదు అనుభవం ఎదురైంది.ఆయనపై దాడి చేయడమే కాకుండా చొక్కాను చించేశారు.గంటసేపు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు.వందలాదిమంది కార్యకర్తలు చుట్టుముట్టడమే కాకుండా ఆయన కారును ధ్వంసం చేశారు.వైకాపా కార్యకర్తల దాడిలో సభాపతి అనుచరులు ముగ్గురు గాయపడ్డారు.చివరకు అతికష్టం మీద కోడెల...బయటకు రాగలిగారు.
నరసరావుపేట మండలం ఉప్పలపాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ రవీంద్ర బాబుపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు.దాడిలో అతని చేతికి గాయమైంది.
ఆయన కారు అద్దాలు పగులకొట్టారు.దాచేపల్లి మండలం గామాలపాడు,మాచర్ల మండలం కంభంపాడు,గురజాల,చిలకలూరిపేట మండలం యడవల్లి ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగి పలువురు గాయపడ్డారు.దుర్గిలో తెలుగుదేశం,వైకాపా వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో వైకాపా కార్యకర్తతోపాటు ఓటేయడానికి వచ్చిన మహిళ గాయపడింది.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పుల హెచ్చరిక చేయాల్సి వచ్చింది.సమస్యాత్మక ప్రాంతాల్లో సరిపడా బలగాలు మోహరించకపోవడం వల్ల ఘర్షణలను అదుపులోకి తేవడం కష్టమైంది.స్ట్రైకింగ్ ఫోర్స్ వస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల సంఘం నిర్వహణ లోపాలను తీవ్రంగా ఆక్షేపించారు ఏపీ మంత్రి లోకేశ్.తాడేపల్లి మండలం క్రిస్టియన్‌పేట 37వ పోలింగ్ కేంద్రం వద్ద లోకేశ్ ధర్నా చేపట్టారు.పోటీగా వైకాపా నాయకులు ఆందోళన చేశారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.వైకాపా వర్గీయులు రెచ్చిపోయినందున స్వల్పంగా లాఠీఛార్జి జరిగింది.వైకాపా ఒత్తిడితో ఎన్నికల కమిషన్ ఓటుపై వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనంటూ...ఆ తర్వాత ట్విట్టర్ వేదికగానూ లోకేశ్ మండిపడ్డారు.
వైకాపా విధ్వంసం.........