అనాథ శవంగా పరిగణించిన పోలీసులు సమాచారం కోసం అతడు ఉంటున్న గదిని పరిశీలించారు. గదిని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. వివరాలు దొరకలేదు కానీ అక్షరాలా రూ. 3 లక్షల 22 వేల 672 నగదు పోలీసులకు లభ్యమైంది. ఈ దృశ్యాన్ని చూసి పోలీసులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ మొత్తం సమాచారాన్ని పోలీసులు జిల్లా ఉన్నతాధికారులకు తెలిపి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
ఈ బిచ్చగాడు..లక్షాధికారి! - మస్తానయ్య దర్గా
అతడు ఎవరూ లేని అనాథ...12 నెలలుగా అనంతపురం జిల్లా గుంతకల్లు మస్తానయ్య దర్గా వద్ద యానచ చేస్తూ జీవిస్తున్నాడు. అనారోగ్యంతో నిన్నరాత్రి మృతి చెందాడు. వివరాలు కోసం యాచకుని గదిని పరిశీలించిన పోలీసులకు అవాక్కయ్యే దృశ్యం కనిపింది.
ఈ బిచ్చగాడు..లక్షాధికారి!
ఇదీ చూడండి :ట్వీట్ వార్: మీరే తుగ్లక్.. కాదు మీరే తుగ్లక్