విదేశీ శాస్త్రవేత్తల భరోసా... మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నిర్వహణపై హైదరాబాద్ పటాన్‌చెరు ఇక్రిశాట్‌లో సదస్సు నిర్వహించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి- ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్-యూఎస్‌ఐఎస్‌ఏటీ, ఇంటర్నేషనల్ మెయిజ్, వీట్ ఇంప్యూవ్‌మెంట్ సెంటర్- సీఐఎంఎంవైటీ ఆధ్వర్యంలో మూడు రోజుల సదస్సు ప్రారంభమైంది. యూఎస్ కౌన్సిల్ జనరల్ కాథరీన్ హడ్డా, ఇక్రిశాట్ డీడీజీ డాక్టర్ కిరణ్‌శర్మ, సీఐఎంఎంవైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సహా ఆసియాలోని పలు దేశాల నుంచి హాజరైన శాస్త్రవేత్తలు హాజరైన ఈ సదస్సులో... ప్రత్యేకించి భారత్‌లో మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతి, నిర్వహణ చర్యలపై విస్తృతంగా చర్చించారు.
సమగ్ర సస్య రక్షణే మార్గం...
మొక్కజొన్నతో పాటు 80 రకాల పంటలను ఆశించే ప్రమాదం పొంచి ఉండటంతో ముందస్తు నిర్వహణపై శాస్త్రవేత్తలు చర్చిస్తున్నారు. ఖరీఫ్‌కు ముందు నుంచే కత్తెర పురుగుపై అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో 18 ఏళ్ల కిందటే కత్తెర పురుగును నిర్మూలించగలిగారని త్రిలోచన్ మహాపాత్ర తెలిపారు. ఆఫ్రికా ఖండంలో కూడా 44 దేశాల్లో ఆపారమైన నష్టం కలిగించిందని... గత ఏడాది భారత్‌లో ప్రవేశించిన ఈ తెగులు ముందస్తు నివారణకు సమగ్ర సస్య రక్షణ, యాజమాన్య చర్యలు చేపట్టటమే మార్గమని అభిప్రాయపడ్డారు.
డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, డైరెక్టర్ జనరల్, భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్
విదేశీ శాస్త్రవేత్తల భరోసా...
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న సహా ఇతర పంటల్లో కత్తెర దాడి వల్ల 900 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని, ప్రస్తుతం నివారణ మన ముందున్న సవాల్ అని యూఎస్ కౌన్సిల్ జనరల్ కాథరీన్ హడ్డా వ్యాఖ్యానించారు. అమెరికా - భారత్ సంయుక్త భాగస్వామ్యంతో సస్యరక్షణ, యాజమాన్య పద్ధతుల ద్వారా రైతులకు ఉపశమనం కలిగిస్తామని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: వరంగల్ జైలుకు సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి