దేశంలో కరోనా సృష్టించిన సంక్షోభ పరిస్థితుల్లో.. ఆదాయ పన్ను శాఖ అన్ని రకాల పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. రూ.5 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్న రీఫండ్ మొత్తాన్ని తక్షణం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
పన్ను చెల్లింపుదారులకు ఊరట.. పెండింగ్ రీఫండ్ల విడుదల!
కరోనా దృష్ట్యా వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేసింది ఆదాయ పన్ను శాఖ. పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.18 వేల కోట్లు రీఫండ్‌లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించింది.
కరోనా కాలంలో చేదోడుగా రిఫండ్లు విడుదల చేస్తున్నాం: ఐటీశాఖ
ఐటీ శాఖ నిర్ణయంతో దాదాపు 14 లక్షల మంది పన్ను చెల్లింపు దారులు లబ్ధి పొందనున్నారు. అలాగే ఎంఎస్ఎంఈ సహా.. ఇతర వ్యాపార సంస్థలకు ఇవ్వాల్సిన దాదాపు రూ.18 వేల కోట్లు జీఎస్టీ, కస్టమ్ రీఫండ్స్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఆదాయ పన్నుశాఖ తాజా నిర్ణయంతో దాదాపు లక్ష వ్యాపార సంస్థలు ప్రయోజనం పొందనున్నాయి.
ఇదీ చదవండి:కరోనా కట్టడిలో 'కేరళ మోడల్' సూపర్ హిట్!
Last Updated : Apr 8, 2020, 8:28 PM IST