విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలపై లేఖ విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో తన సర్వేలు లెక్క తప్పాయన్న లగడపాటి... ప్రజలనాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. 2004 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ వచ్చానన్న రాజగోపాల్... పక్షపాతం లేకుండా అనేక సందర్భాల్లో ప్రజలనాడి తెలిపానని వివరించారు. తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలని కోరారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్షనేతగా నిర్మాణాత్మక పాత్రను పోషించాలని అభిప్రాయపడ్డారు.
సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి - ap elections
భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ప్రజలనాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు.
lagadapati