తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఏకంగా ముఖ్యమంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ముఠా

సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టేందుకు యత్నించింది ముగ్గురు సభ్యులున్న ఓ ఘరానా ముఠా. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరుతో ఉన్న లెటర్​పై సీఎం సంతకాన్ని ఫోర్జరీ చేసి 2 ఎకరాల స్థలం మ్యుటేషన్ చేయాలని అధికారులకు ముఠా దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన అధికారులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది.

సీఎం సంతకాన్నే ఫోర్జరీ చేసిన ముగ్గురు సభ్యుల ముఠా

By

Published : May 18, 2019, 9:33 PM IST

Updated : May 19, 2019, 12:15 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ చేసి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా చేయడానికి ప్రయత్నించిన ముగ్గురిని రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. నాంపల్లిలోని గౌసిపురకు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌ ఖురేషి, రషీద్‌ హుస్సేన్‌, అమరేంద్ర ఈ కేసులో ప్రధాన నిందితులు.
ఉస్మాన్‌ ఖురేషి... రషీద్‌ వద్ద తెరాసకు చెందిన లెటర్‌ ప్యాడ్ 60 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. అనంతరం అమరేంద్రను సంప్రదించి లెటర్‌పై గచ్చిబౌలిలోని 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మ్యుటేషన్‌ చేయాలని సిఫార్సు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అనుమానం వచ్చిన రాజేంద్రనగర్‌ ఆర్డీఓ... సీఎం కార్యాలయంలో లేఖ గురించి విచారణ జరపగా అది నకిలీదని తేలింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో బాబాఖాన్‌ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.
నిందితులు ఈ తరహాలో మరిన్ని మోసాలకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సీఎం సంతకాన్నే ఫోర్జరీ చేసిన ముగ్గురు సభ్యుల ముఠా
Last Updated : May 19, 2019, 12:15 AM IST

ABOUT THE AUTHOR

...view details