ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగొంది కాలనీకి చెందిన నాయనప్ప ఉరి వేసుకొని చనిపోవడం స్థానికులకు కన్నీరు తెప్పించింది. నాయనప్ప భార్య లీలమ్మ రెండు నెలల కిందట చనిపోయింది. అప్పట్నుంచి ముభావంగా ఉన్న నాయనప్ప బుధవారం భార్య సమాధి వద్దకు వెళ్లాడు. అక్కడే ఆమె చీరతోనే చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య సమాధి వద్దే ఉరివేసుకుని భర్త ఆత్మహత్య... - suicide news in kangondi
తనను కంటికి రెప్పలా చూసుకున్న భార్య చనిపోయిందన్న విషయాన్ని తట్టుకోలేకపోయాడు ఆ భర్త. రెండు నెలలు నరకం అనుభవించాడు. జీవితమంతా ఒకేసారి చీకటిగా అనిపించిందో ఏమో.. తన భార్య సమాధి దగ్గరే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య సమాధి వద్దే ఉరివేసుకుని భర్త ఆత్మహత్య...