ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగా, ఒడిస్సా తీరాలలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని స్పష్టం చేసింది.
ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపుకి వంపు తిరిగి ఉండడం వల్ల ఇది మరింత తీవ్రంగా మారి రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. ఫలితంగా రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
'బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన'
ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు : ఐఎండీ
ఇవీ చూడండి : ట్రాఫిక్ నియంత్రణకు నూతన సిగ్నలింగ్ వ్యవస్థ