తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఈనెల 15న 'ఇంటర్​ వివరాలు' సమర్పించండి

హైకోర్టులో ఇవాళ ఇంటర్​ వ్యవహారంపై విచారణ జరిగింది. రీవెరిఫికేషన్​ ఇంకా పూర్తి కాలేదని, వివరాలు సమర్పించేందుకు వారం రోజుల సమయం కావాలని ఇంటర్​బోర్డు న్యాయస్థానాన్ని కోరింది. ఈనెల 15 వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

ఈనెల 15న 'ఇంటర్​ వివరాలు' సమర్పించండి

By

Published : May 8, 2019, 3:47 PM IST

Updated : May 8, 2019, 8:40 PM IST

ఈనెల 15న 'ఇంటర్​ వివరాలు' సమర్పించండి

ఇంటర్​ ఫలితాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీవెరిఫికేషన్​ ఇంకా కొనసాగుతోందని అడ్వకేట్​ జనరల్​ రామచంద్రరావు ధర్మాసనానికి నివేదించారు. రీవెరిఫికేషన్​లో గుర్తించిన అంశాలు సమర్పించేందుకు వారం రోజులు గడువు కావాలని ఇంటర్​ బోర్డు కోరింది. బోర్డు విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం ఈనెల 15న పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

10 తేదీలోగా ఫలితాలు

ఇంటర్​ ఫలితాల వ్యవహారంపై న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్​ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్​ నేతృత్వంలోని వేసవి సెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్లోబరీనా సంస్థనూ ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ బాలల హక్కుల సంఘం ఇంప్లీడ్​ పిటిషన్​ దాఖలు చేసింది. ఈ నెల 15న మరోసారి వాదనలు వింటామని హైకోర్టు విచారణ వాయిదా వేసింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి, ఇంటర్​ బోర్డు కార్యదర్శి అశోక్​ న్యాయస్థానానికి హాజరయ్యారు. ఈనెల 10 తేదీలోగా ఫలితాలు వెల్లడిస్తామని బోర్డు తెలిపింది.


ఇవీ చూడండి: 'విద్యార్థుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున చెల్లించాలి'

Last Updated : May 8, 2019, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details