అప్పీలుకు అవకాశం
'భూ సేకరణ విషయంలో మా ఆదేశాలనే ధిక్కరిస్తారా...?' - కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ విషయంలో హైకోర్టు ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ విషయంలో అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొగుటలో భూ సేకరణపై తమ ఆదేశాలను ధిక్కరించినందుకు నలుగురు అధికారులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. అయితే అప్పీలు చేసుకునేందుకు వీలుగా ఆరు వారాల పాటు శిక్ష అమలును నిలిపివేసింది.
!['భూ సేకరణ విషయంలో మా ఆదేశాలనే ధిక్కరిస్తారా...?'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3464563-thumbnail-3x2-highcourt.jpg)
అధికారులు అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షల అమలును 6 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా తొగుటలో పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టవద్దంటూ గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే తీర్పును ఉల్లంఘించి... పోలీసులతో బెదిరిస్తూ బలవంతంగా భూములును స్వాధీనం చేసుకుని పనులు చేయిస్తున్నారని కొందరు కోర్టు ధిక్కరణ కింద వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది.
ఇదీ చూడండి : హైకోర్టులోనే తేల్చుకోండి రవిప్రకాశ్‌కు సుప్రీం సూచన