తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కథానాయకుడు సూర్యతో ఆర్య.. సైకిల్ రైడ్ - kappan

ప్రస్తుతం 'కాప్పన్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు హీరోలు సూర్య, ఆర్య. వీరిద్దరూ సరదాగా సైకిల్ రైడ్​కు వెళ్లిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

సహా కథానాయకుడు ఆర్యతో సైకిల్ రైడ్ చేసిన సూర్య

By

Published : Mar 24, 2019, 11:32 AM IST

కోలీవుడ్ హీరో సూర్యకు తమిళంలోనే కాదు.. తెలుగులోనూ అభిమానులున్నారు. అతని కొత్త చిత్రం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఏ చిన్న లుక్ బయటకొచ్చిన సంబరపడిపోతుంటారు. ప్రస్తుతం 'కాప్పన్' సినిమాలో ఆర్యతో కలిసి నటిస్తున్నాడీ గజినీ హీరో. వీరిద్దరు సరదాగా సైకిల్ రైడ్​కి వెళ్లారు."సైకిల్ రైడ్ విత్ ఆర్య" అనే క్యాప్షన్​తో ఆ ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నారు.

సహ కథానాయకుడు ఆర్యతో సైకిల్ రైడ్ చేసిన సూర్య

లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మరోసారి పవర్​ ఫుల్ పోలీస్ అధికారిగా సూర్య నటిస్తున్నాడు. మలయాళ నటుడు మోహన్​లాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆర్యకు జోడీగా సాయేషా సైగల్ నటిస్తోంది. కెె.వి ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబరులో విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details