తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'మల్లేశం'ను అభినందించిన తలసాని - hero priyadarshi meet talasani srinivas yadav in west marredpally for breakfast

తన యంత్రంతో చేనేత కార్మికుల కష్టాలను తగ్గించిన మల్లేశం నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మల్లేశం'కు ప్రముఖుల నుంచి సర్వత్ర అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదయ్​ చిత్ర బృందాన్ని వ్యక్తిగతంగా మెచ్చుకున్నారు.

hero priyadarshi meet talasani srinivas yadav in west marredpally for breakfast

By

Published : Jun 22, 2019, 3:25 PM IST

తెలంగాణ యాసలో... చేనేత కార్మికుల కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన మల్లేశం చిత్ర యూనిట్​ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. మల్లేశం చిత్ర హీరో, హీరోయిన్, డైరెక్టర్​తో వెస్ట్​మారేడ్​పల్లిలోని తన నివాసంతో మంత్రి అల్పాహారం సేవించారు. సినిమా అద్భుతంగా ఉందని ఇలాంటి సినిమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు. సినిమాకి పన్ను రాయితీ కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హీరోహీరోయిన్లు ప్రియదర్శి, అనన్య నటన సహజంగా ఉందని తలసాని సాయికిరణ్​ కితాబిచ్చారు. సినిమాలో పలు అంశాలను సహజత్వంగా చిత్రీకరించారని తలసాని మెచ్చుకున్నారు. తన జీవితంలో మల్లేశం చిత్రం ఓ మలుపురాయని ప్రియదర్శి అన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు, ప్రేక్షకులంతా తమ సినిమాను ఆదరిస్తున్నారని ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలని కోరారు.

'మల్లేశం'ను వ్యక్తిగతంగా అభినందించిన తలసాని

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details