రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు తరలిస్తున్న నోట్లకట్టలు, భారీ ఎత్తున మద్యం, మత్తు పదార్థాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు అక్రమ రవాణా అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక బృందాలు, టాస్క్ఫోర్స్ దళాలకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల కోడ్ అమలు అయినప్పటి నుంచి నేటి వరకు 60కోట్ల 55లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా 4కోట్ల 72లక్షల విలువైన 3లక్షల 16 వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 2కోట్ల 83 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు, 65లక్షల 84వేల ఇతర వస్తువులు పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటన్నింటిని కలుపుకుంటే ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం 68కోట్ల 76 లక్షలు ఉంటుందని వారు పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా నగదు స్వాధీనం - money
లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో నగదు ప్రవాహం కట్టలు తెంచుకుంది. భారీ ఎత్తున నగదుతోపాటు మద్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అక్రమ చర్యలను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి భారీ మెుత్తంలో నగదు, మద్యం, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల వేళ భారీగా నగదు స్వాధీనం