మెదక్ జిల్లా తుఫ్రాన్‌లో ఎమ్మెల్యే హరీశ్‌రావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా... ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హరీశ్‌రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ వాహనం దిగి దూరంగా వెళ్లారు.
హరీశ్‌రావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం - fire
త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. మెదక్ జిల్లా తుఫ్రాన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా... ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు