హైవేపై వాహనం దగ్ధం... ట్రాఫిక్‌కి అంతరాయం - vechile
ఏపీలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ భారీ వాహనం మంటలకు ఆహుతైంది. దట్టమైన పొగలు కమ్ముకున్నందున కొంత సమయం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

haiveepai-
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలోని తమ్మయ్య పేటవద్ద 16 నంబరు జాతీయ రహదారిపై ఓవాహనం అగ్నికి ఆహుతైంది. మంటలవల్ల కొంతసమయం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనలో రోడ్డు నిర్మాణ పనులకు వినియోగించే వాహనం పూర్తిగా కాలిపోయింది. కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, షార్ట్ షార్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
హైవేపై వాహనం దగ్ధం... ట్రాఫిక్‌కి అంతరాయం