హైతీ అధ్యక్షుడి నివాసంపై రాళ్ల దాడి కరీబియన్ దీవిలోని హైతీలో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. ప్రజాధనం దుర్వినియోగం, ద్రవ్యోల్బణ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజల ఆందోళన ఐదోరోజుకు చేరింది. హైతీ రాజధానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు... రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. టైర్లకు నిప్పంటించారు. అధ్యక్షుడి నివాసంపై రాళ్ల దాడి చేశారు. అధ్యక్షుడు సత్వర చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.