తెలంగాణ

telangana

ETV Bharat / briefs

గుజ్జర్ల రిజర్వేషన్లకు రాజస్థాన్​ అసెంబ్లీ ఆమోదం - రాజస్థాన్

గుజ్జర్లకు 5 శాతం కోటా కల్పించే బిల్లుకు రాజస్థాన్​ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

గుజ్జర్ల ఆందోళనలతో అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు

By

Published : Feb 13, 2019, 7:52 PM IST

గుజ్జర్ల ఆందోళనలతో అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు
గుజ్జర్లతో పాటు మరో నాలుగు కులాలకు రాష్ట్ర విద్య, ఉద్యోగాల్లో అదనంగా 5 శాతం కోటా కల్పించే బిల్లుకు రాజస్థాన్​ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

గుజ్జర్ల రిజర్వేషన్లపై ఇటీవల రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 'రాజస్థాన్​ వెనుకబడిన తరగతుల సవరణ బిల్లు-2019'ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు విద్యుత్​ శాఖ మంత్రి బీడీ కల్లా.

రాష్ట్రంలోని 5 కులాలు అత్యంత వెనకబడిన వర్గాలుగా ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్​ అవసరమని ప్రభుత్వం పేర్కొంది.

ఈ బిల్లు ఆమోదంతో రాష్ట్రంలోని గుజ్జర్లు​, బంజరా, గడియా లోహర్, రాయికస్​, గదారియాలకు ప్రస్తుతం అందుతున్న రిజర్వేషన్లు 21 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి.

గుజ్జర్ల నిరసనలు

విద్య, ఉద్యోగాల్లో మరో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుజ్జర్లు దిల్లీ-ముంబయి రైల్వే ట్రాక్​పై బైఠాయించి నిరసనలు చేపట్టారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చి తీరాలని డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలో వారిని శాంతింపజేయడానికి ప్రభుత్వం ఓబీసీ సవరణ బిల్లు-2019ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

ABOUT THE AUTHOR

...view details