తెలంగాణ అసెంబ్లీ నూతన భవన నిర్మాణం కోసం హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఉన్న రోడ్లు, భవనాల శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం అధికారుల బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లు సమాచారం. కొత్త శాసనసభ భవన సముదాయం కోసం ఎర్రమంజిల్లోని స్థలంపై ప్రభుత్వం దృష్టి సారించింది. స్థలాలు ఖరారు అయ్యాక శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 27 వరకు మంచి ముహూర్తాలు ఉండటం వల్ల ఈ అంశంపై ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుని ప్రకటించాల్సి ఉంది.
ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీ!
అసెంబ్లీ కొత్త భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థల అన్వేషణ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ఎర్రమంజిల్లోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయాన్ని అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
కొత్త అసెంబ్లీ!