తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇటు నూతన గురుకులాలు... అటు కొత్త కొలువులు - గురుకుల విద్యాలయాలు

గురుకుల విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్తగా 119 విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్​ ముగిసిన అనంతరం సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్​ జారీ చేయనుంది.

నూతన గురుకులాలు

By

Published : May 9, 2019, 2:52 PM IST

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించే గురుకుల పాఠశాలలను మరిన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో మరో 119 కొత్త గురుకులాలు కొలువు దీరనున్నాయి. వీటితో మొత్తం సంఖ్య 959కు చేరుకోనుంది. మరోవైపు ఎన్నికల కోడ్​ ముగియగానే గురుకులాల్లో 2000కు పైగా నియామకాల కోసం మరోసారి నోటిఫికేషన్​ జారీ చేయనున్నారు.

కొత్త గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రణాళికలు

ఈ ఏడాది నుంచే తరగతులు

ప్రభుత్వం గతంలో నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది 119 గురుకులాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ విద్యా బోధన ప్రారంభిస్తారు. ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. నూతన విద్యాలయాల్లో 28 వేల 960 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి వీటిని సిద్ధం చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించి గురుకుల భవనాలను ఖరారు చేసి ప్రారంభానికి తయారుగా ఉంచాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. బోధన, భోధనేతర సిబ్బందిని పొరుగు సేవల పద్ధతిలో నియమించనున్నారు. ఎన్నికల కోడ్​ ముగిసిన అనంతరం పూర్తి స్థాయి నోటిఫికేషన్​ జారీ చేస్తారు.

విడివిడిగా ఏర్పాటు...

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మొత్తం 298 గురుకుల విద్యాసంస్థలు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కారు ఆయా వర్గాల కోసం విడివిడిగా విద్యాలయాలు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 104 ఎస్సీ, 51 ఎస్టీ సంస్థలను దశలవారీగా నెలకొల్పింది. ప్రస్తుతం వీటిలో 3 లక్షల 60 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటితో పాటు 192 మైనార్టీ, 142 బీసీ గురుకులాల్లో 3 లక్షల 60 వేల మంది చదువుతున్నారు. అటు గతంలో ఉన్న 35 రెసిడెన్షియల్​ పాఠశాలలను జూనియర్​ కళాశాలల స్థాయికి పెంచింది. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్​ డిగ్రీ కళాశాలలను కూడా నెలకొల్పింది.
గురుకుల విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వీటి ద్వారా ఇప్పటి వరకూ దాదాపు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.

ఇదీ చూడండి : మైలార్​దేవ్​పల్లి ప్లాస్టిక్​ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details