టిక్ టాక్, హలో సామాజిక మాధ్యమ సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. తాము అడిగే 21 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని.. లేకపోతే రెండు సంస్థలపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది కేంద్రం.
టిక్ టాక్, హలో యాప్‌లకు నిషేధం ముప్పు - Govt issues notice to Tiktok
ప్రముఖ సామాజిక మాధ్యమాలు టిక్‌టాక్, హలో సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అడిగిన 21 ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోతే నిషేధిస్తామని హెచ్చరించింది.
టిక్ టాక్, హలో యాప్‌లకు కేంద్రం నోటీసులు
టిక్ టాక్, హలో యాప్‌లను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎమ్) చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రెండు సంస్థలకు స్పష్టం చేసింది. మరికొన్ని కీలక అంశాలపై స్పందన కోరింది.
- భారత్ వినియోగదారులకు సంబంధించిన డేటాను ఇతర దేశాలతో పంచుకోబోమని భరోసా ఇవ్వాలి.
- తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు భారత చట్టాల ప్రకారం తీసుకుంటున్న చర్యలపై వివరణ.
- 11వేల నకిలీ రాజకీయ ప్రకటనల కోసం ఇతర మీడియా సంస్థలకు హలో భారీ మెత్తాలు చెల్లించిందనే ఆరోపణలపై వివరణ.
- 13 ఏళ్ల వయస్సుకే ఖాతా తెరిచేందుకు వెసులుబాటు కల్పించడం ద్వారా పిల్లల గోప్యతకు భంగం కల్గించడం.
భారత ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని టిక్ టాక్, హలో సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వచ్చే మూడేళ్లలో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి.
Last Updated : Jul 18, 2019, 1:56 PM IST