వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు గోపిచంద్. తిరు దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ సెట్స్‌పై ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో త్వరలో మరో చిత్రం మొదలవనుంది. తాజాగా బిను సుబ్రహ్మణ్యంతో ఓ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా రాశీఖన్నాను ఎంచుకున్నట్లు సమాచారం.
మరోసారి అలరించనున్న 'జిల్' జోడీ - మరోసారి జంటగా నటిస్తున్ గోపీచంద్-రాశీఖన్నా
'జిల్' సినిమాతో ఆకట్టుకున్న గోపిచంద్-రాశీ ఖన్నా జోడి.. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
మరోసారి జంటగా నటిస్తున్ గోపీచంద్-రాశీఖన్నా
'జిల్' సినిమాలో గోపిచంద్ - రాశీ ఖన్నా కలిసి నటించారు. ఈ జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి నటిస్తున్నారు.
`వెంకీ మామ` సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్గా రాశీ ఖన్నా కనిపించనుంది. మరోవైపు తమిళ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.