తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఐదు రోజుల టెస్టులే బాగుంటాయి: మెక్​గ్రాత్

టెస్టులను నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదనను ఆసీస్ మాజీ బౌలర్ మెక్​గ్రాత్ తప్పుపట్టాడు. తాను సంప్రదాయ టెస్టు క్రికెట్​ను ఇష్టపడతానని అన్నాడు.

By

Published : Jan 3, 2020, 8:47 AM IST

Updated : Jan 3, 2020, 8:56 AM IST

Glenn McGrath
మెక్​గ్రాత్

సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలని తాజాగా ఐసీసీ ప్రతిపాదించిన నేపథ్యంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే, కొందరు మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మెక్​గ్రాత్​ ఈ విషయంపై మాట్లాడుతూ తనకు ఐదు రోజుల టెస్టంటేనే ఇష్టమని తెలిపాడు.

"నేను సంప్రదాయ ఆటగాడిని. ఆట ఇప్పటివరకు ఎలా ఉందో అలానే ఇష్టపడతా. నాకు ఐదు రోజుల ఆట చాలా ప్రత్యేకం. అంతకుమించి కుదించడమంటే నాకు అస్సలు నచ్చదు. సంప్రదాయ ఆటను పింక్‌బాల్‌ టెస్టుగా (డే/నైట్‌) తీసుకొచ్చి మరింత ముందుకు తీసుకెళ్లడం చాలా మంచి పద్ధతి. అయితే, టెస్టు క్రికెట్‌ ఎన్ని రోజులు ఆడాలనేదానికి నేను వ్యతిరేకం. ఇప్పుడెలా ఉందో అలానే ఇష్టం"
-మెక్‌గ్రాత్‌, ఆసీస్ మాజీ బౌలర్

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఈ విషయంపై స్పందిస్తూ ఇప్పుడే దీని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందన్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 2023-2031 వరకు ఐసీసీ నాలుగు రోజుల టెస్టులు నిర్వహించాలని తాజాగా ప్రతిపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి.. రాణించడమా.. స్థానం కోల్పోవడమా..!

Last Updated : Jan 3, 2020, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details