హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని మల్లేపల్లిలో జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మిస్తున్న ఓ ఫంక్షన్ హాల్‌ను కూల్చివేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు నియమాలకు విరుద్ధంగా నిర్మించిన భవనపు కొంత భాగాన్ని తొలగించారు. భవనాలను నిబంధనలకు అనుగుణంగా నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. నియమాలకు విరుద్ధంగా కడుతున్న కట్టడాలను కూల్చేస్తామని హెచ్చరించారు.
'నిబంధనలకు విరుద్ధంగా కడితే కూల్చేస్తాం' - ghmc-demolish
నగరంలో నియమాలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలు, అనుమతులు తీసుకోకుండా కడుతున్న కట్టడాలపై జీహెచ్‌ఎంసీ నిఘా పెంచింది. నియమాలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసే పనిలో పడ్డారు.
ghmc-demolish