తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అర్జున్ రెడ్డి రీమేక్​లో ప్రముఖ తమిళ దర్శకుడు - అర్జున్ రెడ్డి రీమేక్

'అర్జున్​రెడ్డి' సినిమాను తమిళంలో 'ఆదిత్యవర్మ'గా తెరకెక్కిస్తున్నారు. ధ్రువ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ నటించనున్నాడని టాక్.

ఆదిత్యవర్మ సినిమాలో నటించనున్న గౌతమ్ మేనన్

By

Published : Mar 22, 2019, 12:38 PM IST

తెలుగులో 'అర్జున్ రెడ్డి' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. తమిళంలో ఈ చిత్రాన్ని 'ఆదిత్య వర్మ'గా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కథానాయకుడి తండ్రి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్టు సమాచారం.

ఇంతకు ముందే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినా.. కొన్ని కారణాలతో రీషూట్ చేస్తున్నారు. హీరోను తప్ప చిత్రబృందం మొత్తాన్ని మార్చేశారు.
బాలీవుడ్ నటి​ బనితా సంధు హీరోయిన్​గా నటిస్తుండగా, ప్రియా ఆనంద్ కీలక పాత్రలో కనిపించనుంది. గిరీశయ్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జూన్​లో చిత్రం విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details