జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కంటతడి పెట్టారు. కాంగ్రెస్ వీడి తెరాసలో చేరుతున్నందుకు ఉద్వేగానికి లోనయ్యారు. పదవులు ముఖ్యం కాదు.. జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు గండ్ర స్పష్టం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. తమను నమ్మిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జడ్పీ ఛైర్మన్ పదవి కోసం పార్టీ మారామనేది వాస్తవం కాదని ఉద్ఘాటించారు.
కార్యకర్తల ముందు గండ్ర కంటతడి..! - congress
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కంటతడి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ వీడి తెరాసలో చేరిన ఆయన కార్యకర్తల సమావేశంలో ఉద్వేగానికి లోనయ్యారు.

గండ్ర కంటతడి
పార్టీ వీడుతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకు రాజకీయ బిక్షపెట్టిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి రుణపడి ఉంటా. జిల్లా అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా...!
----- గండ్ర వెంకటరమణరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే
గండ్ర కంటతడి
ఇవీ చూడండి: ప్రధాని మోదీపై తెలంగాణ పసుపు రైతుల పోటీ