లాక్డౌన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మద్యం దుకాణాలన్నీ మూసి ఉండటం వల్ల మందుబాబులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితంగా మద్యం దొరక్క ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు.
దక్షిణ కన్నడ జిల్లాలోని కుట్రుపాడి గ్రామానికి చెందిన టామీ థామస్(50) రబ్బర్ తోటలో కూలీగా చేసేవాడు. అయితే మద్యం లభించడం లేదని మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.