వరంగల్ గ్రామీణ జిల్లా నడికూడ మండలం చర్లపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలింది. కొమురయ్య ఇంట్లో సిలిండర్ అమర్చే క్రమంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇంట్లో పేలిన సిలిండర్...ఇద్దరి పరిస్థితి విషమం
వరంగల్ రూరల్ జిల్లా చర్లపల్లిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
FOUR PEOPLE WERE SEVERELY INJURED IN GAS BLAST AND TWO PERSONS IN SERIOUS CONDITION