తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మెట్రో ఎండీతో ఫోర్టమ్​ ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్​ మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డితో ఫోర్టమ్​ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. విద్యుత్​ ఛార్జింగ్​ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు.

మెట్రో ఎండీతో ఫోర్టమ్​ ప్రతినిధుల సమావేశం

By

Published : Apr 5, 2019, 7:15 AM IST

హైదరాబాద్​ మెట్రో రైల్​ ఎండీ ఎన్వీఎస్​ రెడ్డితో ... ఫిన్​లాండ్​కు చెందిన ఫోర్టమ్​ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న విద్యుత్​ ఛార్జింగ్​ స్టేషన్లపై చర్చించారు. బేగంపేట్​, కూకట్​పల్లి, మూసాపేట్​, ఎల్బీస్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సీగూడలలో ఇప్పటికే ఫోర్టమ్​ సంస్థ ఛార్జింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేసింది.

విస్తరించేందుకు ఆసక్తి

ప్రస్తుతానికి ఉచితంగానే సేవలు అందిస్తున్నా.. భవిష్యత్​లో కిలోమీటర్​కు రూ. 2 చొప్పున ధర వసూలు చేయనుంది. మరిన్ని ఛార్జింగ్​ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్​, ఎల్​పీజీ, సీఎన్​జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు.

మెట్రో ఎండీతో ఫోర్టమ్​ ప్రతినిధుల సమావేశం

ఇవీ చూడండి: టిక్​టాక్​ను నిషేధించండి : న్యాయస్థానం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details