నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో వేరుశనగకు మద్దతు ధర కల్పించాలంటూ మార్కెట్ యార్డ్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాల్ రూ.3500 మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారుల తీరుపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై బైఠాయించారు. రోజురోజూకు ధరలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మార్కెట్ యార్డుకు జేసి శ్రీనివాస్ రెడ్డి చేరుకొని అధికారులు, అన్నదాతలతో చర్చలు జరిపారు.
వేరుశనగకు మద్దతు ధరేది? - msp
కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రాకపోవటంతో నాగర్కర్నూల్ జిల్లా రైతులు మార్కెట్ యార్డ్ ఎదురుగా ధర్నా చేపట్టారు. వేరుశనగకు సరైన ధర కల్పించాలంటూ రహదారిపై బైఠాయించారు.
నాగర్కర్నూల్ జిల్లా రైతులు