తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2019, 7:27 PM IST

Updated : Apr 9, 2019, 7:33 AM IST

ETV Bharat / briefs

ఇందూరు రైతుల పిటిషన్​ విచారణ రెండువారాలకు వాయిదా

నిజామాబాద్​ పార్లమెంట్​ ఎన్నికను వాయిదా వేయాలని హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్​ను ఈరోజు ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో ఎన్నికలు సకాలంలో జరగనున్నాయి.

రైతుల తరఫు న్యాయవాది

నిజామాబాద్‌ ఎన్నిక వాయిదా వేయాలంటూ రైతు ఎంపీ అభ్యర్థులు వేసిన పిటిషన్​పై విచారణను హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఈ నిర్ణయంతో ఎన్నిక వాయిదా పడే అవకాశం దాదాపు లేనట్లే. ఈ కేసు విషయంలో ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్‌ చేయాల్సిందిగా పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి సూచించింది. నిజామాబాద్​ రైతుల పిటిషన్​పై ఈరోజు న్యాయస్థానం విచారణ చేపట్టింది.

"మొదట్లో బ్యాలెట్​ పద్ధతిలో ఈసీ ఎన్నిక నిర్వహిస్తామంది. కానీ రెండు రోజుల్లో 25వేల ఈవీఎంలు ఎట్లా తీసుకొచ్చారో.. అలాగే 178 మంది రైతు అభ్యర్థులు గుర్తులు కేటాయించడం రెండు, మూడు గంటల పని అంతే! కానీ ఎన్నికల సంఘం అధికార పార్టీకి వంతపాడుతోంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు పెట్టరు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయరని నమ్మకం ఏంటీ? ఇదంతా కావాలని పార్టీల ప్రోద్భలంతో ముఖ్యంగా అధికార పార్టీ చేస్తున్నట్లు హైకోర్టుకు వివరించాం."
------రచనా రెడ్డి, పిటిషనర్ తరఫు న్యాయవాది


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఎండగడతామని రైతులు స్పష్టం చేశారు. రేపు ఆర్మూర్​లో బహిరంగ సభ నిర్వహించి ఇతర పార్టీల అభ్యర్థులు ఓడిపోయేలా చేస్తామన్నారు.

రైతుల తరఫు న్యాయవాది

ఇవీ చూడండి: 'ఎన్నికలైపోయాక 24 గంటల కరెంటు కూడా రాదు'

Last Updated : Apr 9, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details