తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అకాల వర్షానికి తడిసిన ధాన్యం - rain

అకాల వర్షానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అసలే దిగుబడి తక్కువగా ఉన్న సమయంలో వాన కురవడం వల్ల మరింత నష్టపోయామని రైతులు వాపోయారు.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

By

Published : Apr 17, 2019, 6:27 PM IST

Updated : Apr 17, 2019, 11:24 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డ్​లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకస్మాత్తుగా వర్షం కురవటం వల్ల టార్పాలిన్ కవర్లు కప్పుకోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. అసలే ఈ రబీ సీజన్లో వర్షాలు లేక దిగుబడి లేదు. ఇప్పుడు ఆరబెట్టిన ధాన్యం తడిసి మరింత నష్టానికి కారణమైందని రైతులు వాపోయారు. అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం
Last Updated : Apr 17, 2019, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details